← కీర్తనలు

670. యేసును వెంబడించుటకు నిశ్చయించుకొనుట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెను దిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యే||
1.  నా ముందు శిలువ నావెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యే||
2.  కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యే||
3.  శ్రమయనను బాధలైనను హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండినను యెడబాపెటివారెవరు ||నే యేసు||