← కీర్తనలు

669. పరమశిల్పి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము
1.  అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు ||నీ||
2.  ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||
3.  ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్ ||నీ||