కీర్తనలు

668. రక్షించబడిన పాపి విమోచనానందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత నన్ను దాటిపోయె
1.  గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంక||
2.  ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంక||
3.  మారాను మధురముగ మార్చినాకు బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంక||
4.  మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంక||
5.  ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంక||
6.  అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంక||
7.  నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంక||