కీర్తనలు

656. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)
1.  ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2.  దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ||
3.  యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||
4.  ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ||
5.  దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||తోడుగ||
6.  సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7.  పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||తోడుగ||