కీర్తనలు

657. దేవునికి స్తోత్రగానము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1.  యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవుని||
2.  గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవుని||
3.  నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవుని||
4.  ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవుని||
5.  దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవుని||
6.  ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ||దేవుని||
7.  పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవుని||
8.  గుర్రముల నరులదలి బలము నానందించుడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవుని||
9.  యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవుని||
10.  పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవుని||
11.  భూమికి తన యాజ్ఞన ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవుని||
12.  వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనయు కీలాగున చేసి యుండ లేదని ||దేవుని||