కీర్తనలు

648. క్రీస్తు ప్రభువు రెండవ రాకడ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
1.  పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము||
2.  మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము||
3.  కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||