← కీర్తనలు

647. కృపామయునికి వందన సమర్పణ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
1.  ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||
2.  చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా||
3.  నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||
4.  ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||