కీర్తనలు

649. క్రీస్తు ప్రభువు పునరుత్థానము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము
1.  చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు ||గీతం||
2.  వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం||
3.  అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం||
4.  గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||