← కీర్తనలు

639. న్యాయాధిపతియైన దేవుని తీర్పు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు
1.  ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా||
2.  లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా||
3.  మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా||
4.  గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా||
5.  నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి ||ఆహా||
6.  ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ||ఆహా||
7.  దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును ఎవ్యాని పేరందుండదో వాడగ్నిలో బడును ||ఆహా||