కీర్తనలు

640. అనంతమైన దేవుని ప్రేమ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది
1.  ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు||
2.  సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు||
3.  మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||
4.  కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు||
5.  దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్ (2) ||ఓ యేసు||