← కీర్తనలు

638. ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
1.  నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||హల్లె||
2.  నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||హల్లె||
3.  నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె||
4.  నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీసంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||హల్లె||
5.  నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||హల్లె||