← కీర్తనలు

637. సిలువ శ్రమలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత||
1.  ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||
2.  సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత||
3.  కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంత||
4.  పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత||
5.  ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||ఎంత||
6.  కలువరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత||
7.  యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||ఎంత||