← కీర్తనలు

636. కరుణామయుని ప్రేమ!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||
1.  హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||
2.  రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంత||
3.  ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత||
4.  నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంత||
5.  నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ ||ఎంత||
6.  నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత||
7.  అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంత||