పల్లవి:
ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు
1. యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని||
2. మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||
3. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||
4. నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||
5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని||
6. కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||
7. విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగ అవి వారి మీదికి రావు ||ఎవని||
8. నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని||
9. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని||
