← కీర్తనలు

634. ఎల్లవేళల క్రీస్తు ఆదరణ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప||
1.  విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||
2.  సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||
3.  జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||
4.  జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||
5.  నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||
6.  జీవము నీవే నా దేవుడు నీవే పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||
7.  కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||