పల్లవి:
పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ ||బంపుము||
1. మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ క్షమియించుచుఁ ||బంపుము||
2. వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింపఁ ||బంపుము||
3. ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ నిచ్చి ||బంపుము||
