← కీర్తనలు

613. స్తుతిగానము

రాగం: రేగూప్తి|తాళం: రూపకము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి ||దీవెనతో||
1.  లోకమున నిన్ను వేఁడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులోఁ జేరి యేకముగ స్తోత్రములు నీకుఁ జెల్లింపఁగ ||దీవెనతో||
2.  స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుఁడని నిన్ను స్తుతియించు ||దీవెనతో||