← కీర్తనలు

612. దైవాశీర్వాదము

రాగం: పంతువరాళి|తాళం: అట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా కిలలో నిప్పుడు విలువ లేని దయ గల నీ దీవెన ||కలుగు||
1.  తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక మాకుఁ ||గలుగు||
2.  మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగఁ బెంపఁగ ఘన సహాయము ||కలుగు||
3.  ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగఁ బెంచిన ఘన సౌఖ్యంబు ||కలుగు||