← కీర్తనలు

594. మట్టలాదివారము

రాగం: హిందూస్థానితోడి|తాళం: ఆది|రచయిత: గేరా ప్రేమయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసు||
1.  భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా ప్రియమొప్పగతాను ||యేసు||
2.  గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసు||
3.  పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసు||
4.  కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా ||యేసు||
5.  చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి భక్తిని చూపిరి సాగుచు జనులంతా ||యేసు||
6.  యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం దేవాలయమును పరిశుభ్రత చేసె ||యేసు||
7.  మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు గల్గించియు మరి ననయము బ్రోచునిలన్ ||యేసు||