← కీర్తనలు

593. మట్టలాదివారము

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: బన్యన్ జోసఫ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||
1.  మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||
2.  పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
3.  కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
4.  యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||
5.  మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
6.  మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||