కీర్తనలు

595. మట్టలాదివారము

రాగం: మోహన|తాళం: ఆది|రచయిత: ఇ.జి.ఆనందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో||
1.  మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనో||
2.  అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||
3.  పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనో||
4.  రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా ||మనో||
5.  ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో ||మనో||
6.  జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము ||మనో||