కీర్తనలు

592. The Creed

రచయిత: ఎస్.వి.సైమన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
విశ్వాకాశము లాదులను సృష్టించిన విభుఁ డగు పరమ ఈశుఁడు సర్వశక్తుఁ డగు || భాసుర తండ్రిన నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||
1.  పరిశుద్ధాత్ముని మూలమున మరియ కన్యకా గర్భమున ధరియింప బడి పుట్టిన శ్రీ గురు ప్రభుయేసును నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||
2.  పొంతి పిలాతుని కాలమున నెంతో శ్రమపడి సిల్వఁబడి వింతగ యధోతుల మందెనని || నమ్ముదును నే నమ్ముదును ||
3.  మూఁడవనాఁడు మృతి నుండి వడిగాఁ బునరుత్థానుండై చూడఁగ బరమున కేతెంచె నాధుని కుడియెఁడ గూర్చుండెన్ || నమ్ముదును నే నమ్ముదును ||
4.  అక్కడ నుండి యిహమునకుఁ గ్రక్కున వచ్చి సజీవులకు నిక్కము న్యాయముమృతులకును జక్కగఁ దీర్చెడు నని మదిని || నమ్ముదును నే నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||
5.  పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||
6.  పరిశుద్ధ పరచంబడిన సర్వసాధారణ సంఘం పరిశుద్ధుల యన్యోన్య మగు పరిశుద్ధ స్నేహము కల వంచు || నమ్ముదును నే నమ్ముదును ||
7.  మహికర్మ పరిహారమును దేహ పునరుత్థానము బహుళము నిత్య జీవమును మహిమ యనంతమై వెలయు నని || నమ్ముదును నే నమ్ముదును ఆమేన్||