కీర్తనలు

591. అపోస్తలుల విశ్వాస ప్రమాణము

రాగం: నాధనామక్రియ|తాళం: రూపకము|రచయిత: మార్తాండ జ్ఞాన ప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ పరలోక భూలోక ముల నెల్లఁ బుట్టించి పాలించు తండ్రి దే వుని నమ్మెదను నేను ||త్ర్యేక||
1.  శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవునిఁ గూర్మితో నమ్మెదఁ ||ద్ర్యేక||
2.  పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద దేవ కొట్టఁబడి చనిపోయి పెట్టఁబడి భూమిలో మూఁడవ దినమందు మృతి గెలిచి లేచెను ||త్ర్యేక||
3.  పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు దేవ సింహాసనముమీఁద స్థిరముగాఁ గూర్చుండి యున్నాఁడు చిరన్యాయ కర్తయై యున్నాఁడు ||త్ర్యేక||
4.  అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు దేవ మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబుఁ దీర్చును న్యాయవంతుఁడు యేసు ||త్ర్యేక||
5.  శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను నిజ మిది ||త్ర్యేక||
6.  పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా నమ్మెదఁ ||త్ర్యేక||
7.  నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు తండ్రి దే వుఁడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుఁడౌ దేవుండు ||త్ర్యేక||