590. అపోస్తలుల విశ్వాస ప్రమాణము

రాగం: జంఝూటి • తాళం: ఆది • రచయిత: మల్లెల దావీదు
పల్లవి:పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను ||పరలోక||
1. ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన పరిశుద్ధాత్మ వలనఁ గ న్యా మరియమ్మకు జన్మించెఁ ||పరలోక||
2. పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను ||పరలోక||
3. మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు ||పరలోక||
4. అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను ||పరలోక||
5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్ ||పరలోక||