← కీర్తనలు

580. ప్రథమ ఫలములు

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: బండారు సుజ్ఞానము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా ||సార్వజగతికి||
1.  ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి||
2.  కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి||
3.  ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి||