← కీర్తనలు

579. కృతజ్ఞతార్పణల పండుగ

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను కిదియె తరుణమీయరమ్ము ||
1.  అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||కేది||
2.  వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది||
3.  మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||
4.  పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది||
5.  ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||