← కీర్తనలు

578. కృతజ్ఞతార్పణలు

రాగం: హిందూస్తాని కన్నడ|తాళం: తిశ్రజాతి ఏక|రచయిత: బొంతా సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||
1.  ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||
2.  పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||
3.  వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||
4.  కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||