← కీర్తనలు

577. ఉత్సవ కీర్తన

రాగం: జంఝూటి|తాళం: ఏక|రచయిత: యెషయా వీరమార్టిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు గాను స్మరణఁ జేతుము ||పరమ||
1.  నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము హర్స రవముతోఁ ||పరమ||
2.  అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ||
3.  వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను సేవ జేయుట ||పరమ||
4.  ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ||
5.  మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ||
6.  గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ||
7.  శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ||
8.  దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ||