కీర్తనలు

563. వివాహము

రాగం: జంఝూటి|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల||
1.  కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||
2.  యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల||
3.  కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల||
4.  భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||