← కీర్తనలు

564. దైవాశీర్వాదము

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: అల్లారి పెదవీరాస్వామి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను ||దేవర||
1.  దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర||
2.  ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర||
3.  ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర||
4.  తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును ||దేవర||
5.  సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్ ||దేవర||
6.  మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర||
7.  ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||
8.  వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్ ||దేవర||