← కీర్తనలు

562. మంగళము

రాగం: ఆనందభైరవి|తాళం: కురుఝుంపె|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||
1.  రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||
2.  దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||
3.  ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||
4.  చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||
5.  పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||