కీర్తనలు

552. అభినయ క్రిస్మస్ గీతము

రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల||
1.  దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||
2.  గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల||
3.  జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల||
4.  భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||
5.  లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||