← కీర్తనలు

551. ఏలపాట

రాగం: శంకరాభరణము|తాళం: అట|రచయిత: మిక్కిలి దేవసహాయము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నే నమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము ||కన్యా||
1.  బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వా డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా||
2.  ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ ప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||
3.  తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల బాధల నో యేసు నాధ యంటుఁ బాపి జంటజేయుము ||కన్యా||
4.  మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుఁడ వగుచుఁ గంటి కింపు గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను ||గన్యా||