కీర్తనలు

549. క్రీస్తునందు బాలలు ఒక్కటే

రాగం: యదుకులకాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: సి.విజయ చార్లెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||
1.  పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము ||ఏ||
2.  బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల ప్రయాసపడుదము ||ఏ||