← కీర్తనలు

547. యేసును అనుకరించుట

రాగం: శంకరాభరణము|తాళం: ఏక|రచయిత: పి.విజయ చార్లెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||
1.  యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||
2.  పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||