← కీర్తనలు

546. చిన్న పిల్లలను నిషేదింపవద్దు

రాగం: సురటి|తాళం: ఆది|రచయిత: తూపిలి యోహాను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న||
1.  ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న||
2.  ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న||
3.  ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న||
4.  శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||