← కీర్తనలు

544. దేవుఁడు మంచివాఁడు

రాగం: బిలహరి|తాళం: ఆది|రచయిత: దేవుఁడు బలే మంచివాఁడు ధరణిని బాలించువాఁడు ఈవుల నిచ్చువా డు నెల్లరిని గాచువాఁడు ||దేవుఁడు||

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు||
1.  అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు||
2.  కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు||