← కీర్తనలు

543. ఆదర్శుల ననుకరించుట

రాగం: హిందూస్థాని ముఖారి|తాళం: జుల్వ|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||ననుకరించెద||
1.  పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||
2.  తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
3.  పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
4.  శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
5.  పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
6.  యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
7.  అనుపల్లవి: విత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
8.  ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
9.  భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||