పల్లవి:
రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||
1. తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ జల్లనైన మోక్ష మియ్య ||రాజా||
2. బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా||
3. మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా||
4. దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా||
