కీర్తనలు

537. యేసునాధా, రమ్ము

రాగం: శహన|తాళం: ఏక|రచయిత: ఫిలిప్ బెంజమిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసునాధా రారారా మా జీవనాధా రారారా||
1.  దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు ||యేసు||
2.  నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు ||యేసు||
3.  నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు ||యేసు||
4.  పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి ||యేసు||
5.  లోకపాపమును జయించి లోకుల రక్షించితివి ||యేసు||
6.  వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి ||యేసు||