కీర్తనలు

535. బాలల విన్నపము

రాగం: కురంజి|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ పోషకా||
1.  బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ బ్రోవుమా||
2.  మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా యందు జూపుమా||
3.  చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ మరువనీకుమీ||
4.  ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు మఖిలకాలము||
5.  పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ జేర గరుణజూపుము ||