← కీర్తనలు

534. యేసు నామమునకు జయము

రచయిత: ఎబిలిన్ ప్రీష్టి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు నామమునకు జయం జయ మిప్పుడే ||జయం||
1.  ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||
2.  ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి యేసు ప్రభు వాయనే ||జయం||
3.  రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక యేసు దాపు జేరుఁ డిప్పుడే ||జయం||