← కీర్తనలు

527. యువజనులకు క్రీస్తు ఆహ్వానము

రచయిత: బొంతా నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె మేలు కోరుము జీవమునే ||ఓ||
1.  పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||
2.  భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||
3.  మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||