← కీర్తనలు

528. బాలల ప్రవర్తన

రాగం: యదుకులకాంభోజి|తాళం: అట|రచయిత: దాసరి మోజెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు లకునదె మూలమనిగమనింపరా ||బాలకా||
1.  తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు పడిన తిప్పలు నీ వెఱుఁగవా? ||బాలకా||
2.  గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||
3.  పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే ||బాలకా||
4.  కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా||
5.  వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా||
6.  ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన యాలితో సహకూలఁడే ||బాలకా||
7.  కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా||
8.  తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే ||బాలకా||
9.  బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా||