కీర్తనలు

526. యేసువలె జీవించుట

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: పి.విజయ చార్లెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసువలె ఇల నేనుండెదను యేసువలెను ||
1.  శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు నేను ||యేసువలెను||
2.  భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలెను||
3.  సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు నేను ||యేసువలెను||
4.  ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై నేను ||యేసువలెను||
5.  ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు పైకి జూతును నేను ||యేసువలెను||
6.  నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో నేర్తును ||యేసువలెను||
7.  వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున నేను ||యేసువలెను||