← కీర్తనలు

523. యువజనుల క్రీస్తునందు సంతోషించుట

రాగం: సారంగ|తాళం: ఝుంపె|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య దేదీప్యగుణతేజా ||దేవాది||
1.  చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా ||దేవాది||
2.  దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము మాపై విరఁజల్లవే చల్లగా ||దేవాది||
3.  నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా ||దేవాది||
4.  యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా భ్యాసములను దూరముఁ దొలఁగించుము ||దేవాది||
5.  ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము దాని దర్శించుటే జీవము ||దేవాది||
6.  బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు నిజముగాఁ జూపించుము ||దేవాది||
7.  ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము బలము శిశువుల మైన మా కవి యిమ్ము ||దేవాది||