← కీర్తనలు

524. క్రైస్తవ యువజనులారా క్రీస్తు కొరకు నిలువండి

రాగం: బేహాగ్|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ ||భారత||
1.  బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ ||భారత||
2.  శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ ||భారత||
3.  నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ ||భారత||
4.  విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ ||భారత||