పల్లవి:మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా చాలా పాడరే వేలపాడరే ||మేలు||
1. పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||
2. అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||
3. తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||
4. జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||
5. నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు||
