← కీర్తనలు

518. క్రైస్తవుని ప్రతిజ్ఞ

రాగం: యమునా కళ్యాణి|తాళం: త్రిపుట|రచయిత: ఏ.చార్లెస్ కిన్సింగర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము||
1.  అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||
2.  వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||
3.  ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||
4.  సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము ||
5.  ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||
6.  శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||
7.  చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||
8.  పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||
9.  జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము ||