← కీర్తనలు

519. క్రైస్తవ గృహము

రాగం: కాంభోజి|తాళం: ఆది|రచయిత: ఇ.జి.ఆనందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||
1.  జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ||రమ్ము రమ్ము||
2.  సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||
3.  అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల ||రమ్ము రమ్ము||
4.  నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల ||రమ్ము రమ్ము||